ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

7, సెప్టెంబర్ 2008, ఆదివారం

అష్టాచెమ్మ

అష్టాచెమ్మ చుసాను ...కాదు ఆడాను
పేరు లో ఏముంది ,ని న్ను ప్రేమిస్తున్నాను నీ పేరు ని కాదు అని జులియట్ రోమియో తో అంటుంది షేక్స్ పియర్ నా టకం లో .
అష్టాచెమ్మ సినిమా లో లావు (లావణ్య) మాత్రం పేరుని చూ సే ప్రేమిస్తుంది .సినిమా అంతా మహేష్ పేరు చుట్టూ తిరుగుతుంది.సినిమా బాగానే ఉంది .మొదటి బాగం హైదరాబాద్ లోను రెండవ బాగం లక్కవరం లో ను తీసారు .
ఇంద్రగంటి, మాయాబజార్ సినిమా లో డబ్బు లేని హీరో పాత్రను డీల్ చేసాడు .అ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు.అందుకనేమో ఈ సినిమాలో హీరో ,హీరోయిన్ ల కు అందరికి డబ్బు కొట్లలో ఉంటుంది .
అమృతం సీరియల్ లోని నటు లను పెట్టడం వలన అ సిరియల్ మార్క్ కనిపిస్తుంది.కొత్త వారిని పెట్టుకొని ఉంటే కొత్తదనం కనిపించేది .హీరో లు ఇద్దరు కొత్తవారే అయినా బాగా చేసారు కదా .ఆనంద్ సినిమా పేరు ను మహేష్ బాబు పేరును బాగా కాష్ చేసు కున్నారు. సినిమా పేరు కథ కు నప్పలేదు.పరమ పద సోఫనపటం అయితే బాగుంటుంది.టైటిల్స్ యాని మే ష న్ అంత బాగో లేదు .

నలుగు రికీ నచ్చిన వి .....నాకసలే నచ్చినవి
సినిమా బెగినింగ్
మాటలు బాగున్నాయి
స్వాతి , నాని ,శ్రీనివాస్ ,హేమ బాగా చే సారు
రాం బాబు లక్కవరం లో ఊరి పెద్ద గ తీర్పు చెప్పడం చాలా నవ్వు తెప్పించింది .
హేమ ఉన్న సీన్స్ అన్నిచా లా బాగున్నాయి.
పాటలు అన్నీ బాగున్నాయి .
సినిమా టైం పాస్ అవుతుంది .పైసా వసూల్

మొత్తం మీద అస్లిలత ,హింస లేకుండా వచ్చే ఇలాంటి సినిమాలను ఆహ్వానించాలి .

లేబుళ్లు:

4 కామెంట్‌లు:

  • :-)

    బాగుంది మీ టపా! పరమపద సోపాన పటం అని టైటిలుంటే మీరెళ్ళే వారా సినిమా చూడటానికి? ;-)

    పాటులు బాగున్నాయి కదా, కొన్ని రోజులు ఆడుతుందిలెండి.

    Blogger Purnima ద్వారా, 7 సెప్టెంబర్, 2008 12:51 PMకి వద్ద  

  • ఈ మధ్య నేను చూసిన రెండు మంచి సినిమాలు హోమం, అష్టాచెమ్మా.

    హోమం : కొంచం డిఫరెంట్ గా సినిమా ఆలోచించే వాళ్ళకు బా నచ్చుతుంది.

    అష్టాచెమ్మా.: చాలా సింపుల్ గా అందంగా డీసెంట్ గా ఉంది.

    Blogger Unknown ద్వారా, 7 సెప్టెంబర్, 2008 1:36 PMకి వద్ద  

  • ఈ చిత్రంపై నా సమీక్షని ఈ రోజు సాయంత్రం నవతరంగంలో చదవండి.

    Blogger Kathi Mahesh Kumar ద్వారా, 7 సెప్టెంబర్, 2008 2:21 PMకి వద్ద  

  • పూర్ణిమ గారు మీరు సరిగ్గా చెప్పారు .సినిమా పేరు కచ్చితం గా సినిమా విజయవంతం అవటానికి ఎంతో కొంత ఉపయోగపడు తుంది .ఉదా హరణకు గోరింటాకు పేరు ఆడవారందరిని ఆకట్టు కుంటుంది .సాదారణం గా అందరూ అలానే మంచి పేర్లు పెడుతుంటారు. ఎవరో కొంతమంది మాత్రం" కేక "లాంటి పేర్లు పెడుతుంటారు .వారికీ వారి మీద చాలా ...నమ్మకం ఎక్కువ.

    Blogger అరుణాంక్ ద్వారా, 8 సెప్టెంబర్, 2008 7:56 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్