ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

8, సెప్టెంబర్ 2010, బుధవారం

వినుకొండ రిక్షా


కొండలు వినగాలవా నాన్న అని అడుగుతుంది మాపాప .
లాస్ట్ వీక్ వొక ఫంక్షన్ కోసం వినుకొండ వెళ్ళటం జరిగింది .అక్కడ సైకిల్ రిక్షా లో విహరించాం .పది హేను సంవత్సరాల క్రితం గురజాల లో రిక్షా ఎక్కినట్లు గుర్తు .
ఇంతకు వినుకొండ కు ఆ పేరు ఎలా వచ్చింది ?

7 కామెంట్‌లు:

  • రాముడు సీతకోసం వెదుకుతుండగా, జటాయువు సీతాపహరణం గురించి రామునికి సమాచారం ఇచ్చింది ఇక్కడ ఉన్న కొండమీదే అంటారండీ కనుకే ఆ ఊరికి రాముడు సీత జాడ ’విన్నకొండ’ అని పేరు వచ్చింది. కాలక్రమంలో ’వినుకొండ’ అయింది అని చెప్తారు ఆ ఊరివాళ్ళు, అందుకే వినుకొండ డిపో బస్సులు అన్నిటిమీద పక్షి(జటాయువు) బొమ్మ ఉంటుంది.

    Blogger వేణూశ్రీకాంత్ ద్వారా, 8 సెప్టెంబర్, 2010 7:09 PMకి వద్ద  

  • పక్షం రోజుల క్రితం ఓ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వినుకొండ వెళ్ళాను.అక్కడ రిక్షాలను చూసి విస్తుబోయాను. ఈ కాలంలో కూడా రిక్షాలు ఇంకా కొన్ని ఊళ్ళలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే.ఒక్కసారిగా బాల్య స్మృతులు జ్ఞప్తికి వచ్చాయి.

    Blogger బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ ద్వారా, 8 సెప్టెంబర్, 2010 8:43 PMకి వద్ద  

  • శీ రాముదు సీత అపహరనమ్ మొదత గ విన్న కొన్ద వినుకొన్ద అన్దుకే వినే కొ౦డ అలా... వినుకొన్ద అయిన్ది...

    Blogger ఆత్రేయ ద్వారా, 8 సెప్టెంబర్, 2010 9:13 PMకి వద్ద  

  • కొన్నేళ్ల క్రితం, మేం మహబూబ్ నగర్ లో వుండేప్పుడు, మా తమ్ముడికూతురు--అప్పటికి నాలుగైదేళ్లు--మాతో రైల్లో వస్తూ, హైదరాబాదు దాటాక వచ్చే "ఉందానగర్" స్టేషన్ వస్తే, "ఇదేమిటి? యెవరైనా ఈ నగర్ వుందా అని అడుగుతున్నారా?" అని అడిగేసరికి కంపార్టుమెంట్ లో వాళ్లందరూ హాయిగా నవ్వేశారు!

    ఇంకా, "'లేదానగర్' అనేది ఇంకోటికూడా వుంటుందా?" అని అడిగింది!

    పిల్లల తెలివి అలా వుంది. మనం సమాధానం చెప్పగలమా?

    Blogger A K Sastry ద్వారా, 8 సెప్టెంబర్, 2010 10:36 PMకి వద్ద  

  • వినుకొండకు ఆ పేరెలా వచ్చిందంటే...

    వినుకొండ లో కొండ మీద ఒక రామాయలం ఉంది చూశారా? రావణుడు సీతను ఎత్తుకుపోతుంటే జటాయువు సీత ఆర్త నాదాలను విన్నది ఆ కొండ మీదేట! అందువల్ల అది "విన్న కొండ" గా పేరు తెచ్చుకుని క్రమ క్రమంగా వినుకొండగా మారిందిట.కరెక్టేనా కథ?:-))

    ఈ గూడు రిక్షా నాక్కూడా చాలా ఇష్టమండీ!ఆ మధ్య నేను నరసరావుపేట్రియాట్స్ బ్లాగులో ఈ గూడు రిక్షా గురించి ఒక పోస్టు రాశాను చూడండి వీలైతే!

    http://narasaraopet-bloggers.blogspot.com/2010/08/blog-post.html

    అందులో మొదట ఉన్న రిక్షా ఫొటో వినుకొండలో తీసిందే! బ్లాగర్ వేణూ శ్రీకాంత్ పంపించారు.

    Blogger సుజాత వేల్పూరి ద్వారా, 9 సెప్టెంబర్, 2010 9:24 AMకి వద్ద  

  • మరిచేపోయాను.

    మీ వినుకొండలోనే కాదు--మా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం యేరియాల్లో కూడా ఇంకా ఇలాంటి గూడు రిక్షాలే తిరుగుతున్నాయి.

    Blogger A K Sastry ద్వారా, 9 సెప్టెంబర్, 2010 9:02 PMకి వద్ద  

  • అరుణాంక్ గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

    హారం

    Blogger భాస్కర రామిరెడ్డి ద్వారా, 12 సెప్టెంబర్, 2010 7:43 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్