ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

26, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ప్రతి ఉదయమూ............ ఒక సమరమే

ప్రతి ఉదయమూ............ ఒక సమరమే
సూర్యోదయం తో పాటే
అరంబం ఉ రుకులు పరుగులు




కన్నా లేరా ,బుజ్జి లేమ్మా

టైం అఇందమ్మా



కన్నా లేమ్మా ,బుజ్జి లేరా

టైం అఇందమ్మా



ఇంకా లేవ లేదా ?

రాత్రి తొందరగా నిద్ర పోరు

కధలు చెప్పమని ఒకటీ పోరు ---సుప్రభాతం శురూ




బ్రష్ చేసు కుంటారా ,బాత్ రూమ్ కెలతారా

ప్రతి రొజూ చెప్పాలంటారా





అమ్మ అక్క పేస్టు ఇవ్వ టం లేదు





ఆఁ .... మీ రిద్దరూ గొడవ పెట్టుకున్నరో

ఇద్దరికీ దెబ్బలు పడ తై ఏమను కుంటున్నారో




డా డి టవల్ కావాలి



బాత్ రూమ్ కెళ్ళే ముందు టవల్ తీసు కెల్లా లి

మీకు ఎన్ని సార్లు చెప్పాలి


అమ్మా ఇడ్లీ నాకొద్దు
నోరు మూసుకొని ఎదిపెడితే అది తి నా లి సిం దే
అసలు ఇడ్లీ అంత మంచి టిఫిన్ ఈ ప్రపంచం లో నీ లేదు
ఆయిల్ తక్కువ ,ఈజీ గా digest అవుతుంది
అసలు మీకు ఒక విషయం తెలుసా
ఇడ్లీ వండుకొని తినే తహత మన దేశం లో సగం మందికి కూడా లేదు మీరేమో ఇడ్లీ వద్దంటారు .


డా డి నిన్న ఉప్మా గురించి కుడా ఇలానే చెప్పావు గదా !


అవునూ అది మంచిదే నోరు మూసుకొని తింటారా లేదా ?

ఆ తినటం ఏమిటి ఏనిమల్ లా
చేతి నిండా పుసు కోవటం అలా టేబుల్
మానర్స్ నేర్చు కోవాలా




అమ్మా బెల్ట్ కనపడటం పడటం లేదు


ముందు రోజీ తీసి పెట్టు కోవాలి
ఈ విషయం మీ కు రొజూ చెప్పాలి


తొందరగా రెడీ అవుతారా
పుస్తకాలూ తీస్తారా



అమ్మా జడ లూసుగా వేసావు

మాట్లాడకు నాకు తెలుసు ఎలా వేయాలో


బయలు దేరండి బస్ వస్తుంది

కన్నలూ ,బుజ్జి బాగా చదువుకోండి జాగ్రత్తగా వినండి
కన్నలకు ఒక ముద్దు,బుజ్జి కి ఒక ముద్దు
ఎందుకమ్మ విసిగిస్తారు ,చెప్పిన మాట వి నా లి గదా


అప్పటి వరకు వాడి పోయిన పిల్లల మొఖాలు వెలిగి పోయాయి .అమ్మ ప్రేమగా మాట్లాడింది కదా !


బాయి మమ్మీ ,బై డాడి

మెట్లు చిన్న గా దిగండిర తొందర లేదు




పిల్లలను టైముకి రెడీ చేసి స్కూల్ కి పంపించే గట్టం లో ఒక రోజు గడిచింది .

ప్రతి రోజు అనిపిస్తుంది పిల్లలను కసురుకోకుడదు, పది సార్లైనా ప్రేమతో చెప్పలని కానీ .................

ఈ globalisatioin ప్రక్రియ తో, మార్కుల కోసంజరిగే పరుగు పందెంలో సాద్యమా ?




Few wards to childern

When mother says, "Do this," or "that,"
Don't say, "What for?" and "Why?"
But let her hear your gentle voice
Say, "Mother dear, I'll try."


4 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్