కాపీ రైటింగ్ కు కాపి రైట్స్ నావే !
ఈ మద్య నేను బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్ పరిక్ష రాసాను .ఎక్షామ్ కు నా ఫ్రెండ్ భాస్కర్ కుడా వచ్చాడు .మేమిద్దరం కలిసే అప్లయ్ చేసాము .సో, మా నంబర్లు కూడా పక్క పక్క నే వచ్చాయి.
నా ముందు నంబరు నా ఫ్రెండ్ ది. నాకు కొంచం చూపించాలి రా , sums answers చెప్పాలి రా ,డ్రాయింగ్ లో కుడా హెల్ప్ చేయాలి అని అడిగాడు .
నీకు హెల్ప్ చేయటానికి నాకు ఎటువంటి అబ్యంతరం లేదు కాని మన నంబర్లు ఒకే లైనులో వస్తాయని నమ్మక ము లేదన్నాను. వాడి పేస్ లో ?
నా నంబరుతో రూమ్ అయిపోయి తర్వాత రూంలో నీ నంబరు రావచ్చు లేదా ఒకే రూమ్ లో వున్నా నీ నంబరు తో నెక్స్ట్ లైను స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పా .వాడు మాత్రం అలా జరిగే ఛాన్స్ అరుదు అన్నాడు .
లేదమ్మా నా ఫ్లాష్ బ్యాక్ లో ఇలాంటి అనుభవం వుంది అని నేను ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళాను .
నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు ...
ఎగ్జామ్స్ కి హాల్ టికట్స్ వచ్చాయి . ఎవరి ముందు ఎవరు ఎవరి తర్వాత ఎవరో తెలిసి పోయిమ్ది .శ్రీనివాస్ అనే మొద్దు ముందు నా నంబరు వచ్చింది .వాడి paremts నన్ను ఇంటికి పిలిపించారు .మంచిగా మాట్లాడి మా వాడికి పరీక్షల్లో చూపించమని బ్రతిమాలారు .సరే అన్నాను .
ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాను .మా నాన్న తన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు .శ్రీనివాస్ వాళ్ల నాన్న ,మా నాన్న క్లాసు మేట్స్ అట .తనకు అసలు లెక్కలు వచ్చేవి కాదట .వాళ్ళకు కిరానా కొట్టు వుండేది .మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకొని డబ్బులు ఇచ్చేవాడట.తర్వాత ఇద్దరు చదువు కొనసాగించలేదనుకొండి.నాన్న వ్యవసాయం తోను ఆటను వ్యాపారం లోను స్థిరపడ్డారు .
నా ఫ్లాష్ బాక్ లోకి వెళదాము .
ఎక్షామ్ ముందు రోజు మళ్లీ పిలిచారు .శ్రీను దగ్గర డబ్బులు వున్నాయి .మిఇరిద్దు ఎవైనా కొనుక్కొని తినండి అని చెప్పారు .మా వూరులో exam సెంటర్ లేదు .పది KM నడిచి పక్క ఊరికి వెళ్ళాలి .అందరం అమ్మయిలు అబ్బాయిలం ఒక పంతులు గారు కలసి వెళ్ళాము .ఎక్షామ్ హాల్ దగ్గర వెళ్ళాక శ్రీను అన్నాడు ఏరా ఇప్పుడు కొనుక్కుమ్దామా లేదా exam రాసాక కొనుక్కుందామా అన్నాడు .నేను తర్వాత కొనుక్కు౦దాము అన్నాను .
తీరా exam హాలు కు వెళ్లి చుస్తే నా నంబరుతో వరుస అయిపోఇంది .శ్రీను గాడి నంబరు తర్వాత వరుస లో తొలి అయ్యింది.ఆతర్వాత వాడు నాతొ మాట్లాడలేదు .అవసరం లేదుకదా !
ఇ౦త కథ చెప్పినప్ప్పటికి మా వాదు లేదురా అప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు అలా జరగదు నేను చెప్తున్నాను కదా అన్నాడు .
ఈ సారీ కూడా చరిత్ర పునరావృతం అయ్యింది .కాక పొతే చిన్న మార్పు వాడి నంబరుతో వరుస అయిపోఇంది .నా నంబరు తో నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయ్యింది .ఇద్దరం పడి పడి నవ్వుకున్నాము .
నా పేరు అ తో మొదలవ్వటం వలన చాల వరకు క్లాసు లో మొదటి నంబరు నాదే వుండేది .కాబట్టి exam హాల్ లో కూడా ఫస్ట్ నా తోటే స్టార్ట్ అయ్యేది .సో ,ముందు చూసి కాపి చేసేండుకు నాకు నో ఛాన్స్ .ఎప్పుడయినాఫ్రెండ్స్ కు హెల్ప్ చేదాద్దామను కుంటే ఇదిగో ఇలా జరుగుతుంది .
కాబట్టి కాపీ రైటింగ్ కు కాపి రైట్స్ నావే అంటాను .
లేబుళ్లు: స్కూల్ డేస్
2 కామెంట్‌లు:
హ హ భలే బాగుంది ... ఆలశ్యం అమృతం విషం అన్నారు.. మీ ఫ్రెండ్ చెప్పినపుడే కొనేసుకుని తినేయాల్సింది
నేస్తం ద్వారా, 16 మార్చి, 2009 9:58 AMకి వద్ద
బాగుంది :)
చైతన్య ద్వారా, 16 మార్చి, 2009 10:41 AMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్