ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

28, మార్చి 2009, శనివారం

కొత్త సంవత్సరం లో దిన చర్య ......

కొత్త సంవత్సరం లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందామని నిన్న ఇంట్లో కూర్చున్నాము .బుక్ ఒకటి (పాత డైరీ ) తీసుకుని మా పాపను రేపటినుంచి ఏమేమి మంచిపనులు చేద్దాము అన్నాను .
డాడీ నువ్వు చెప్పు ఎలా రాయాలి అంది .పొద్దున్నే లేవటం చదువుకోవటం ,15 రోజులకు ఒకసారి ఏదైనా పిక్నిక్ స్పాట్ కు వెళ్ళటం అన్నాను .రోజు ఏ మి చెయ్యాలను కుంటామో దినచర్య రాసుకోవాలి అన్నాను .ఇంకొక అడుగు ముందుకేసి చూడు నేను దిన చర్య రాస్తున్నాను అని మొదలెట్టాను .
ఉదయం 5.30 కి లేస్తా ,అలా నడిచి వస్తా
6.00 కు పాలు తెస్తా
7.౦౦ కు టిఫిన్ చేస్తా
9.౦౦ కు ఆఫీసు చెక్కేస్తా
5.౩౦ కు ఇంటికొస్తా
6.౦౦ కు టిఫిన్ మేస్తా
7.౦౦ వరకు ఆటలాడి వస్తా
8.౩౦ వరకు పిల్లల తాట తీస్తా (చదివిస్తా)
9.౦౦ కి భోజనం చేస్తా
9.౩౦ కి పడకేస్తా
ఆఫీస్ లో ఏమి చేస్తానో రాయలేదని అనుకుంటున్నారా , ఆ విషయం "ధన చర్య " లో రాస్తా
ఇది విని మా ఇంట్లో ఒకటే నవ్వులు
నా శ్రీమతి దీనికీ ఖూనీలని పేరు పెట్టింది .అదేనండి హైకూలు ,నానిలు అని ఉంటాయి కదా అలాంటివనమాట.

లేబుళ్లు:

5 కామెంట్‌లు:

  • తినగానే అరగంట లోపు పడుకుంటారా... మంచిది కాదండి... తినటానికి కనీసం 2 లేదా 3 గంటల ముందు తినేయాలి...

    Blogger చైతన్య ద్వారా, 28 మార్చి, 2009 9:55 PMకి వద్ద  

  • పడుకోవటానికి 2 లేదా 3 గంటల ముందు అని నా ఉద్దేశం...

    Blogger చైతన్య ద్వారా, 29 మార్చి, 2009 9:52 AMకి వద్ద  

  • మి కుటుంభం కళ్ళముందు కనబడిందంటే నమ్మండి :)

    Blogger నేస్తం ద్వారా, 29 మార్చి, 2009 10:23 AMకి వద్ద  

  • మీరు చెప్పినట్లు 2,3 గంటలు గాప్ మైంటైన్ చేస్తె బాగుంటుంది.కాని యాంత్రిక ఉగంలో అంత సమయం కస్టం .కనీసం ఒక గంట ఉంతే మంచిది .
    నిజానికి నా జీవన శైలి బిన్నంగా ఉంటుంది.నేను షిఫ్ట్ లో పని చేస్తాను .ప్రతి రెందు రోజులకు దిన చర్య మారుతుంది .సులభం గా అర్థం కావాలని అలా రాసాను .

    మా కుటుంబాన్ని చూపిస్తానండి

    Blogger అరుణాంక్ ద్వారా, 29 మార్చి, 2009 5:05 PMకి వద్ద  

  • "8.౩౦ వరకు పిల్లల తాట తీస్తా" :) :)

    Blogger పరిమళం ద్వారా, 31 మార్చి, 2009 11:35 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్