ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

28, మార్చి 2009, శనివారం

కొత్త సంవత్సరం లో దిన చర్య ......

కొత్త సంవత్సరం లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందామని నిన్న ఇంట్లో కూర్చున్నాము .బుక్ ఒకటి (పాత డైరీ ) తీసుకుని మా పాపను రేపటినుంచి ఏమేమి మంచిపనులు చేద్దాము అన్నాను .
డాడీ నువ్వు చెప్పు ఎలా రాయాలి అంది .పొద్దున్నే లేవటం చదువుకోవటం ,15 రోజులకు ఒకసారి ఏదైనా పిక్నిక్ స్పాట్ కు వెళ్ళటం అన్నాను .రోజు ఏ మి చెయ్యాలను కుంటామో దినచర్య రాసుకోవాలి అన్నాను .ఇంకొక అడుగు ముందుకేసి చూడు నేను దిన చర్య రాస్తున్నాను అని మొదలెట్టాను .
ఉదయం 5.30 కి లేస్తా ,అలా నడిచి వస్తా
6.00 కు పాలు తెస్తా
7.౦౦ కు టిఫిన్ చేస్తా
9.౦౦ కు ఆఫీసు చెక్కేస్తా
5.౩౦ కు ఇంటికొస్తా
6.౦౦ కు టిఫిన్ మేస్తా
7.౦౦ వరకు ఆటలాడి వస్తా
8.౩౦ వరకు పిల్లల తాట తీస్తా (చదివిస్తా)
9.౦౦ కి భోజనం చేస్తా
9.౩౦ కి పడకేస్తా
ఆఫీస్ లో ఏమి చేస్తానో రాయలేదని అనుకుంటున్నారా , ఆ విషయం "ధన చర్య " లో రాస్తా
ఇది విని మా ఇంట్లో ఒకటే నవ్వులు
నా శ్రీమతి దీనికీ ఖూనీలని పేరు పెట్టింది .అదేనండి హైకూలు ,నానిలు అని ఉంటాయి కదా అలాంటివనమాట.

లేబుళ్లు: