ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

28, మార్చి 2009, శనివారం

కొత్త సంవత్సరం లో దిన చర్య ......

కొత్త సంవత్సరం లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందామని నిన్న ఇంట్లో కూర్చున్నాము .బుక్ ఒకటి (పాత డైరీ ) తీసుకుని మా పాపను రేపటినుంచి ఏమేమి మంచిపనులు చేద్దాము అన్నాను .
డాడీ నువ్వు చెప్పు ఎలా రాయాలి అంది .పొద్దున్నే లేవటం చదువుకోవటం ,15 రోజులకు ఒకసారి ఏదైనా పిక్నిక్ స్పాట్ కు వెళ్ళటం అన్నాను .రోజు ఏ మి చెయ్యాలను కుంటామో దినచర్య రాసుకోవాలి అన్నాను .ఇంకొక అడుగు ముందుకేసి చూడు నేను దిన చర్య రాస్తున్నాను అని మొదలెట్టాను .
ఉదయం 5.30 కి లేస్తా ,అలా నడిచి వస్తా
6.00 కు పాలు తెస్తా
7.౦౦ కు టిఫిన్ చేస్తా
9.౦౦ కు ఆఫీసు చెక్కేస్తా
5.౩౦ కు ఇంటికొస్తా
6.౦౦ కు టిఫిన్ మేస్తా
7.౦౦ వరకు ఆటలాడి వస్తా
8.౩౦ వరకు పిల్లల తాట తీస్తా (చదివిస్తా)
9.౦౦ కి భోజనం చేస్తా
9.౩౦ కి పడకేస్తా
ఆఫీస్ లో ఏమి చేస్తానో రాయలేదని అనుకుంటున్నారా , ఆ విషయం "ధన చర్య " లో రాస్తా
ఇది విని మా ఇంట్లో ఒకటే నవ్వులు
నా శ్రీమతి దీనికీ ఖూనీలని పేరు పెట్టింది .అదేనండి హైకూలు ,నానిలు అని ఉంటాయి కదా అలాంటివనమాట.

లేబుళ్లు:

27, మార్చి 2009, శుక్రవారం

అందరికి నూతన సంవత్సర (ఉగాది )శుభాకాంక్షలు


అందరికి విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.

22, మార్చి 2009, ఆదివారం

వాన ..వర్షం ....

వర్షం గురించి చైతన్య తన బ్లాగులో ఒక పోస్ట్ రాసారు .
వర్షం గురించి ఎంత చెప్పినా తక్కువే .మనం మాత్రం చిన్నప్పుడు బాగానే వర్షం తడిసాం.కాని మన పిల్లలను మాత్రం తడవనియ్యం .హాస్పిటల్ చుట్టూ తిరగలేమని బయం . జలుబు చేసి ఒక్క రోజు స్కూల్ మానేసినా వెనక పడిపోతారని అపోహ .మేము మాత్రం రైన్ కోట్ వేసుకొని వెళ్ళమని చెపుతున్నాం. మజా ఏమి వస్తుంది?
నేనొక మసాల లేని వాన పాట చూపిస్తాను .

లేబుళ్లు:

16, మార్చి 2009, సోమవారం

కాపీ రైటింగ్ కు కాపి రైట్స్ నావే !



ఈ మద్య నేను బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్ పరిక్ష రాసాను .ఎక్షామ్ కు నా ఫ్రెండ్ భాస్కర్ కుడా వచ్చాడు .మేమిద్దరం కలిసే అప్లయ్ చేసాము .సో, మా నంబర్లు కూడా పక్క పక్క నే వచ్చాయి.

నా ముందు నంబరు నా ఫ్రెండ్ ది. నాకు కొంచం చూపించాలి రా , sums answers చెప్పాలి రా ,డ్రాయింగ్ లో కుడా హెల్ప్ చేయాలి అని అడిగాడు .

నీకు హెల్ప్ చేయటానికి నాకు ఎటువంటి అబ్యంతరం లేదు కాని మన నంబర్లు ఒకే లైనులో వస్తాయని నమ్మక ము లేదన్నాను. వాడి పేస్ లో ?

నా నంబరుతో రూమ్ అయిపోయి తర్వాత రూంలో నీ నంబరు రావచ్చు లేదా ఒకే రూమ్ లో వున్నా నీ నంబరు తో నెక్స్ట్ లైను స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పా .వాడు మాత్రం అలా జరిగే ఛాన్స్ అరుదు అన్నాడు .

లేదమ్మా నా ఫ్లాష్ బ్యాక్ లో ఇలాంటి అనుభవం వుంది అని నేను ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళాను .
నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు ...
ఎగ్జామ్స్ కి హాల్ టికట్స్ వచ్చాయి . ఎవరి ముందు ఎవరు ఎవరి తర్వాత ఎవరో తెలిసి పోయిమ్ది .శ్రీనివాస్ అనే మొద్దు ముందు నా నంబరు వచ్చింది .వాడి paremts నన్ను ఇంటికి పిలిపించారు .మంచిగా మాట్లాడి మా వాడికి పరీక్షల్లో చూపించమని బ్రతిమాలారు .సరే అన్నాను .

ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాను .మా నాన్న తన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు .శ్రీనివాస్ వాళ్ల నాన్న ,మా నాన్న క్లాసు మేట్స్ అట .తనకు అసలు లెక్కలు వచ్చేవి కాదట .వాళ్ళకు కిరానా కొట్టు వుండేది .మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకొని డబ్బులు ఇచ్చేవాడట.తర్వాత ఇద్దరు చదువు కొనసాగించలేదనుకొండి.నాన్న వ్యవసాయం తోను ఆటను వ్యాపారం లోను స్థిరపడ్డారు .
నా ఫ్లాష్ బాక్ లోకి వెళదాము .

ఎక్షామ్ ముందు రోజు మళ్లీ పిలిచారు .శ్రీను దగ్గర డబ్బులు వున్నాయి .మిఇరిద్దు ఎవైనా కొనుక్కొని తినండి అని చెప్పారు .మా వూరులో exam సెంటర్ లేదు .పది KM నడిచి పక్క ఊరికి వెళ్ళాలి .అందరం అమ్మయిలు అబ్బాయిలం ఒక పంతులు గారు కలసి వెళ్ళాము .ఎక్షామ్ హాల్ దగ్గర వెళ్ళాక శ్రీను అన్నాడు ఏరా ఇప్పుడు కొనుక్కుమ్దామా లేదా exam రాసాక కొనుక్కుందామా అన్నాడు .నేను తర్వాత కొనుక్కు౦దాము అన్నాను .
తీరా exam హాలు కు వెళ్లి చుస్తే నా నంబరుతో వరుస అయిపోఇంది .శ్రీను గాడి నంబరు తర్వాత వరుస లో తొలి అయ్యింది.ఆతర్వాత వాడు నాతొ మాట్లాడలేదు .అవసరం లేదుకదా !

ఇ౦త కథ చెప్పినప్ప్పటికి మా వాదు లేదురా అప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు అలా జరగదు నేను చెప్తున్నాను కదా అన్నాడు .

ఈ సారీ కూడా చరిత్ర పునరావృతం అయ్యింది .కాక పొతే చిన్న మార్పు వాడి నంబరుతో వరుస అయిపోఇంది .నా నంబరు తో నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయ్యింది .ఇద్దరం పడి పడి నవ్వుకున్నాము .
నా పేరు అ తో మొదలవ్వటం వలన చాల వరకు క్లాసు లో మొదటి నంబరు నాదే వుండేది .కాబట్టి exam హాల్ లో కూడా ఫస్ట్ నా తోటే స్టార్ట్ అయ్యేది .సో ,ముందు చూసి కాపి చేసేండుకు నాకు నో ఛాన్స్ .ఎప్పుడయినాఫ్రెండ్స్ కు హెల్ప్ చేదాద్దామను కుంటే ఇదిగో ఇలా జరుగుతుంది .

కాబట్టి కాపీ రైటింగ్ కు కాపి రైట్స్ నావే అంటాను .

లేబుళ్లు:

15, మార్చి 2009, ఆదివారం

చెట్లను నరక వద్దు ......

funny వీడియో చూడండి.
మెసేజ్ కుడా వుంది .

http://www.santabanta.com/video.asp?video=2823

లేబుళ్లు:

12, మార్చి 2009, గురువారం

యమునా తీరం .....

నాకు ఆనంద్ సినిమాలో సాంగ్స్ చాల ఇష్టం .యమునా తీరం ..... చూడండి

8, మార్చి 2009, ఆదివారం

బాలయ్య ఇన్ అండ్ యాస్ పోకిరి

పోయిన వారం ఒక ఫేర్ వెల్ పార్టి జరిగింది .అందులో మా collegue రెండు జోక్స్ చెప్పాడు .అతనుబాలయ్య ఫాన్ .
బాలయ్య సినిమా డైలాగులు
రాబోయే సినిమాలో బాలయ్య డైలాగు
గట్టిగా ఒక్క గుద్దుగుద్దానంటే ... గూగుల్ సెర్చ్ లో కుడా దొరకవురా ...
బాలయ్య పోకిరిగా
పోకిరి సినిమాలో మహేష్ ఒక గాంగ్ లో నుంచి మరొక గాంగ్ లోకి మారతాడు .ఏరా నీకు నీతినియమాలు లేవా నిన్న వరకు మాతోటి ఉండి ఈ రోజు వాళ్ళతోటి కాలుస్తావా ?
మహేష్ అంటాడు నువ్వు డబ్బులు ఇవ్వు వీడిని లేపెస్తా ...
ఇదే seen బాలయ్య తో
ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు advance తీసుకోని సినిమా చేస్తూ వేరే వాళ్ళతోటి కలిసి తిరుగుతుంటాడు .అప్పుడు వాళ్ళు అడుగుతారు .ఏమిటయ్యా బాలయ్య నీకు ;;;;;;;; లేవా (పైన డైలాగేనండి)
అప్పుడు బాలయ్య అంటాడు .నాకు ఎవరైనా ఒకటే ,నువ్వు పది లక్షలు ఇవ్వు వీడికి ఒక ప్లాపు ఇస్తాను .

లేబుళ్లు:

6, మార్చి 2009, శుక్రవారం

కావ్యాస్ డైరీ పాటలు

ఈ మద్య వచ్చిన మ్యూజిక్ albums లో కావ్యాస్ డైరీ పాటలు బాగున్నాయి .ఒక్కసారి వింటే అంత గా ఎక్కవు కాని తర్వాత బాగుంటాయి .మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ హోరు లేకుండా melodious గా ఉన్నాయి .ఒక చెవ్వు ఇటు పడెయ్యండి.
http://beta.musicmazaa.com/telugu/audiosongs/movie/Kavyas+Diary.html

5, మార్చి 2009, గురువారం

ఆట -మూడు (ఆట-౩) అయిపోయింది.

ఆట -మూడు (ఆట-౩) అయిపోయింది.
పోయిన వారం అల్ఆ ఛానల్స్ స్కాన్ చేస్తుంటే జ తెలుగు లో ఆట -౩ రిసల్ట్ చెప్తున్నట్లు అనిపించింది .అప్పుడప్పుడు డాన్స్ షో చుస్తుమ్దేవాడిని .సో, చూద్దాం ఎవరు గెలిచారో అని రిమోట్ పక్కన పెట్టాను .టాటా ఇండికాం ఆట-౩ టైటిల్ విన్నర్ ఈస్ అనటం బ్రేక్ ఇవ్వటం ఇలా ఒక గంట సాగదీసాడనుకొండి.
కానీ సురేష్ మరియు స్నేహ చేసిన డాన్స్ ఒకటి చూపించాడు .ఇట్ ఈస్ excellant.కింద లింక్ చుడండి .
http://www.youtube.com/watch?v=IPbyxYBpgzs