ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

29, జనవరి 2009, గురువారం

అరుంధతి సినిమా నిజంగా అంత బాగుందా ?

అరుంధతి సినిమా నిజంగా అంత బాగుందా ?

అందరూ మంచి రివ్యు లు రాస్తున్నారు .సినిమాలో గ్రాఫిక్స్ తప్ప నాకేమి నచ్చలేదు .దేముడు ఉన్నాడు అని నమ్ముతాముకాబట్టి దయ్యం ఉందని నమ్మాలట.పకీరు బాబా లకు మంచి గిరాకి పెరుగుతుంది . కొంత మంది అమాయకుల చేతులు ,కాళ్ళు ,నాలుక తీసేస్తారు .అఘోరాలు అన్న అనుమానంతో .

పిల్లల మనసులో ప్రేతాత్మలు, దయ్యాల గురించి బాగా నాటుకు పోతుంది .నిజంగా కోడి గ్రేట్ .దెయ్యాలు ,క్షుద్ర శక్తులు లేవని చెప్పే సైన్స్ &టెక్నాలజీ ని ఉపయోగించు కొని అఘోరాలు ఉంట యని నిరూపించాడు.

సాదారణంగా సినిమాకు వినోదం కోసమ్ వెళతాము.వినోదము అంటే బయపడటం కుడా అని నాకు తెలియదు .

డబ్బులిచ్చి నవ్వటానికి సినిమాకు వెళతాము ,హీరోయిసంకోసం వెళతాము ఎందుకంటే మనం చేయలేని రొమాన్స్ ,యుద్దాలు చూసి మనం చేసినట్లు వుహించుకుంటాం. ఏడుపు సినిమాలు కూడా చూస్తాము ,బయట ఏడవలేక సినిమాలో బాగా ఏడ్చి వస్తాము .ఇది కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు .

కాని డబ్బులిచ్చి బయపడటానికి మనం తయారైపోయాం .ఇంతకు ముందు చాలా తక్కువమంది ఇలాంటి వారు వుండేవారు .

అఘోరాల గురించి చాల బాగా ప్రాజెక్ట్ చేసాడు కాని ,దేవత (జేజమ్మ) శక్తీ గురించి అసలు చెప్పనే లేదు .ఈ సినిమా వల్ల ఏమైనా సమాజానికీ ఉపయోగాముందా? కీడు తప్ప ...

లేబుళ్లు:

17, జనవరి 2009, శనివారం

శ్రీమతి వూరు వెళితే.. ...

శ్రీమతి సంక్రాంతి పండుగ సెలవలకు వూరు వెళ్ళింది .నాకు కస్టాలు మొదలైనాయి.
ఇల్లు అసలు ఇల్లు లానే లేనే లేదు ....అనే ఘజల్ గుర్తుకొచ్చింది.ఘజల్ శ్రీనివాస్ గారు పాడిన ఆ ఘజల్ చాల బాగుంటుంది .ఎప్పుడైనా వినండి .
వంట చేద్దామని చేతులు కాల్చుకున్నాను .పండుగకు కాంటీన్ వాడు కూడా సెలవు పెట్టాడు .వంట చేయటం తప్పలేదు .బంగాళ దుంప కూర చేద్ద్దామని నూనె వేసాను .అది పూర్తిగా వేడెక్కిన తర్వాతగాని తెలియలేదు నూనె చాల ఎక్కువ వేశానని ..దాన్ని కొంచం స్టిల్ గ్లాసు లో పోసాను .ఆ గ్లాసు చేత్తో పట్టుకుని పక్కన పెట్టాను .చేయి కాలకుండా వుంటుందా?
వంట చెస్తూ ఆనంద్ సినిమా టీవీ లో చూసాను .ఈ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం .జ్యోతి గారి బ్లాగు లో అను కుంటా స్త్రీ వాది గురించి డిస్కషన్ అవుతుంది .శేకర్ కమ్ముల స్త్రీ వాది అనిపించింది .లేడిస్ ను నెగటివ్ shadeలో చూపలేదు .
టిఫిన్ ,ఉప్మా చేసుకుమ్దామనుకున్నకానీ ఇడ్లి రవ్వ కు ఉప్మా రవ్వకు చాలా సేపు తేడా తెలియ లేదు .
వాషింగ్ మెషిన్ దగ్గర ఇంకొక సమస్య వచ్చింది .మెషిన్ లో వేసే సర్ఫు ఏదోమాములుగా వాడె సర్ఫు ఏదో తెలియలేదు .
ఇలా డవుట్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి కనుక్కుందాము అనుకున్నా .కానీ .. ఎందుకు తను DISTURB అవుతుంది ,నాలుగు రోజులు అయినా ప్రశాంతం గా ఉండనిద్దాం అను కున్నా .
ఈ రోజు ఇంకొక గన కార్యం చేశాను .లీటరు పాలు స్టవ్ మీద పెట్టి పడుకున్నా .గిన్నె కాలిన వాసనకు గుర్తొచ్చింది .
ఎంత బోరు గా వుందో .రేపు వచ్చాక చెపుతాను.

లేబుళ్లు:

14, జనవరి 2009, బుధవారం

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .....




కాస్త ఆలస్యంగా
అరుణాంక్


10, జనవరి 2009, శనివారం

అంతా సత్యం మయం

మూడు రోజులనుంచి " సత్యం "అవకతవకల గురించి టీవీ చానల్స్ జోరు ,హోరు ప్రసారాలు చూడలేక పోతున్నాము .
మీడియా కు ఐదు రోజుల ముందే పండగ వచ్చింది.వీల్ల గురించి ఎక్కువ గా మాట్లాడటం అనవసరం ..కానీ తప్పదు...ఈ వ్యవస్థ లోనే బతుకుతున్నాం కదా !
TV9 లో సాయంత్రం ఫోన్ లైవ్ ఇన్ ప్రేఒగ్రం టెలీ కాస్ట్ chesaaru. pattabhi gaarani advokate anukumtaa
రామలింగా రాజు గురించి పసితివే గా మాట్లాడుతున్నాడు .ఈ మూడు రోజుల్లో అతనే మొదటి వ్యక్తీ అనుకుంట అలా మాట్లాడటం .
గోదావరి జిల్లా నుంచి ఒకతను ఫోనేచేసి మాట్లా డాడు .
"రాజు గారు ఎవరినీ మోసం చేయరు .ఎవరికీ అన్యాం చేయరు .ఉభయ గొడవై జిల్లాల్లో అందరూ బాధపడుతున్నారు .మేము సరిగా అన్నం కూడా తినటం లేదు .ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారు .తప్పు చేసానని నిజాయితీగా వప్పు కున్నాడు.ఇప్పటి వరకు మన దేశం లో ఎవరైనా వప్పుకున్నరా?
ఆయన గురించి మాట్లాడే అర్హత రాజకీయనాయకులకు లేదు. "
చివరి రెండు మాటలు నాకు నిజమే అనిపించింది.సత్యం ,రామలింగా రాజు బ్రెయిన్ చైల్డ్ .దాన్ని నాశనం చేయాలని అనుకోడు.accounts manipulation అందరూ చేస్తారు .every company does some sort of manipulation to gain ఆర్ maintain the గుడ్ విల్ ,but సత్యం has crossed the limits.

ఎడిటోరియల్స్ లో రొజూ ఒకరిని ఒకరు దూషనకు దిగే పత్రికలకు ,ఒక పక్షానికి కొమ్ముకాసి పనికి రాని వార్తలను అనుక్షణం ప్రసారం చెసే neews channals కు,
అది చేస్తాం ఇది చేస్తాం అని అధికారం లోకి వచ్చి ప్రజలను పిక్కుతినే రాజకీయ నాయకులకు సత్యం ను ప్రశ్నించే అర్హత లేదు.వీళ్ళు డబ్బు కంటే ఎంతో విలువైన ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారు.

PWC ,foreign auditing agency అంటే మనకు క్రేజ్ .ఏమి చేసారు ?

సత్యం షేర్ హోల్దేర్స్ ,clients అండ్ ఇండియన్ judiciary కి మాత్రమే సత్యం రాజు ను నిల దీసే అర్హత ఉంది.


విన్నపం

తెలుగు బ్లాగ్గర్స్ activities (అంటే మీట్ ఇన్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ మరియు విజయవాడ బుక్ ఫెస్టివల్ లాంటివి )
ను కూడలి .ఆర్గ్ మెయిన్ పేజి లో scorrling మెసేజ్ వస్తే అందరు చూస్తారని నా అభిప్రాయం.
దీని గురించి vvn అండ్ శ్రీధర్ గారు అలోచించ గలరు.

6, జనవరి 2009, మంగళవారం

ఒక్క టికెట్ కు నాలుగు ,ఐదు సినిమాలు ...

ఒక్క టికెట్ కొని నాలుగు ఐదు సినిమాలు చూడొచ్చు .ఎలా అంటే

కింగ్ సినిమాకు వెళ్ళటమే ..

రేస్,welcome,omsanthiom ,చంద్రముఖి, ఇవి నాకు తెలిసిన సినిమాలు కింగ్ లో చూసాను.ఇంకా ఎవైనా హింది సినిమాలు వున్నాయేమో ..

కాకపొతే హింది సినిమాలు చూడకపోతే కింగ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నట్లు అనిపిస్తుంది.

సాంగ్స్ బాగా లేవు .నాగార్జున డాన్స్ sequncelo చాల uneasy గా ఉన్నాడు .కొన్ని చోట్ల camara వైపు కొత్త వాడిలా చూస్తున్నాడు (డైరెక్టర్ న్యూ లుక్ kaavalannademo).

బ్రహ్మానందం సినిమాకు hilight.

అప్పటికి యువరాజ్(హింది) వచ్చి వుండదు .vitla అ సినిమా కూడా చుపించేవాడే.

అనవసరంగా ఎక్కువ fights పెట్టాడు.

టైం పాస్ సినిమా.