శ్రీమతి వూరు వెళితే.. ...
శ్రీమతి సంక్రాంతి పండుగ సెలవలకు వూరు వెళ్ళింది .నాకు కస్టాలు మొదలైనాయి.
ఇల్లు అసలు ఇల్లు లానే లేనే లేదు ....అనే ఘజల్ గుర్తుకొచ్చింది.ఘజల్ శ్రీనివాస్ గారు పాడిన ఆ ఘజల్ చాల బాగుంటుంది .ఎప్పుడైనా వినండి .
ఇల్లు అసలు ఇల్లు లానే లేనే లేదు ....అనే ఘజల్ గుర్తుకొచ్చింది.ఘజల్ శ్రీనివాస్ గారు పాడిన ఆ ఘజల్ చాల బాగుంటుంది .ఎప్పుడైనా వినండి .
వంట చేద్దామని చేతులు కాల్చుకున్నాను .పండుగకు కాంటీన్ వాడు కూడా సెలవు పెట్టాడు .వంట చేయటం తప్పలేదు .బంగాళ దుంప కూర చేద్ద్దామని నూనె వేసాను .అది పూర్తిగా వేడెక్కిన తర్వాతగాని తెలియలేదు నూనె చాల ఎక్కువ వేశానని ..దాన్ని కొంచం స్టిల్ గ్లాసు లో పోసాను .ఆ గ్లాసు చేత్తో పట్టుకుని పక్కన పెట్టాను .చేయి కాలకుండా వుంటుందా?
వంట చెస్తూ ఆనంద్ సినిమా టీవీ లో చూసాను .ఈ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం .జ్యోతి గారి బ్లాగు లో అను కుంటా స్త్రీ వాది గురించి డిస్కషన్ అవుతుంది .శేకర్ కమ్ముల స్త్రీ వాది అనిపించింది .లేడిస్ ను నెగటివ్ shadeలో చూపలేదు .
టిఫిన్ ,ఉప్మా చేసుకుమ్దామనుకున్నకానీ ఇడ్లి రవ్వ కు ఉప్మా రవ్వకు చాలా సేపు తేడా తెలియ లేదు .
వాషింగ్ మెషిన్ దగ్గర ఇంకొక సమస్య వచ్చింది .మెషిన్ లో వేసే సర్ఫు ఏదోమాములుగా వాడె సర్ఫు ఏదో తెలియలేదు .
ఇలా డవుట్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి కనుక్కుందాము అనుకున్నా .కానీ .. ఎందుకు తను DISTURB అవుతుంది ,నాలుగు రోజులు అయినా ప్రశాంతం గా ఉండనిద్దాం అను కున్నా .
ఈ రోజు ఇంకొక గన కార్యం చేశాను .లీటరు పాలు స్టవ్ మీద పెట్టి పడుకున్నా .గిన్నె కాలిన వాసనకు గుర్తొచ్చింది .
ఎంత బోరు గా వుందో .రేపు వచ్చాక చెపుతాను.
లేబుళ్లు: శ్రీమతి
6 కామెంట్‌లు:
సోదరా: తొందర్లో టిపినీలు ఎలా చేస్కోవాలో పెడతా నా నలభీమాలో :):) నాకైతే "నో నాగమణీ ఎంజాయ్" అనే ఘర్షణ సిన్మా డైలాగు గుర్తొచ్చింది మీ పోస్టు చూడంగనే :):)
మరి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఊరికే పాడేసారా .. :) ..
Brother,
So for next vacation nalamhimapakam will be useful.
Nestam ,
you are right.
follow the link for illu ipudu illu.. song in ghajalsrinivas album
http://chitramala.com/audio-songs/nenu-naa-illu-1265.html
అరుణాంక్ గారు మొన్నే మిమ్మల్ని ఆ పాట ఉన్న link ఇస్తారేమో అడుగుదాం అనుకున్నాను :) ఇలాంటి పాటలు పాడితే భర్తను వదిలి వెళ్ళగలమా ఎక్కడికన్నా !! thanks అండి
నేస్తం,
అప్పుడప్పుడు భర్తను వదలి వెళితేనే కదండి వారికి విలువ తెలుస్తుంది.
అరుణాంక్
:)
గజల్ శ్రీనివాస్ పాటలు మరలా వినిపించినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల తరువాత మరలా వింటున్నా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్