నాన్న చాదస్తం ....
నాన్న ఎప్పుడో రెండు మూడు నెలకొకసారి నాదగ్గరకు వస్తారు .నాలుగు రోజులు ఉండి వెళతారు .ఉన్న నాలుగు రోజులూ ప్రశాంతం గా ఉండవచ్చు కదా !.ఉండరు .ఆ రూము లో లైటు వెలుగుతుంది ,ఈ రూము లో ఫాన్ తిరుగుతుంది అని ఒకటే పని గా చెప్తుంటారు ,ఆపేస్తుం టారు .
ఎందుకు తాతయ్యా మాకు ఇక్కడ కరెంటు ఫ్రీ నే బిల్ ఉండదు వదిలేయండి ... అని మా పిల్లలు అంటారు .నాన్న మాత్రం వూరుకోరు.
ఇంట్లో లైట్స్ మాత్రమేకాదు ,ఫ్లాట్ బయట కామన్ ఏరియాలో ఉన్నా లైట్స్ ఉదయం లేటు గా ఆర్పేసినా సాయంత్రం వెలుగు ఉండగానే ఆన్ చేసినా సెక్యూరిటీ వారి తో దుబారా గురించి చెపుతుంటాడు .
నాన్న పల్లెటూరు లో ఉంటారు .ఎనర్జీ కన్సర్వేషన్ అవేర్నేస్ పల్లెటూర్లలోనే బాగుందని నాకని పిస్తుంది .
మనం కంపెనీ క్వార్టర్స్ లో ఉండవచ్చు .మనం డైరెక్ట్ గా బిల్ కట్టక పోవచ్చు కానీ ఎంతో విలువైనఇ౦దనాన్ని వృదా చెయ్య కూడదు.
రూమ్ లోనుంచి బయటకు వచ్చే టప్పుడు లైట్,ఫాన్ ఆపటం మర్చి పోవద్దు .
ఇదంతా నా చాదస్తం అనుకోకండి.
లేబుళ్లు: ఎనర్జీ సేవింగ్స్
4 కామెంట్‌లు:
i totally agree with you and your father :)
అజ్ఞాత ద్వారా, 4 డిసెంబర్, 2008 11:51 PMకి వద్ద
ఉచితంగా వచ్చిందని అనవసరంగా వాడకుండా,అవసరాన్నిబట్టి వాడటం పిల్లలకు నేర్పించాలి మనం అది మన ఇళ్ళేగానీ వేరెవరిదైనా గానీ.
చిలమకూరు విజయమోహన్ ద్వారా, 5 డిసెంబర్, 2008 5:58 AMకి వద్ద
అందుకే పెద్దవాళ్ళు చెప్పినవి చిరాకుగా అనిపించినా వినాలి.
bphanibabu ద్వారా, 5 డిసెంబర్, 2008 1:45 PMకి వద్ద
చాలా బాగా చెప్పారు అరుణాంక్ గారు.. మీరు చెప్పింది అక్షర సత్యం
నేస్తం ద్వారా, 9 డిసెంబర్, 2008 1:43 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్