ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

26, అక్టోబర్ 2008, ఆదివారం

ఎదగాడనికెందుకురా తొందరా ...........

ఎదగాడనికెందుకురా తొందరా !



ఎదరబ్రతుకంత చిందరవ౦దర..



అనే పాట ఏ సినిమాలో దో ఎవరు రాసారో గుర్తు లేదు కానీ ,ఏ న్ ఆ ర్ మరియ రాజబాబు ఈ పాటలో నటించారు . పాటలో ఎంతో సత్యముంది .



చిన్నపుడు, త్వరగా స్కూల్ చదువు ఐపోతే బాగుండు ఫాంట్లు వేసుకొని కాలేజీ కె ళ్ళ వచ్చు అనుకునే వాడిని .కాలేజీ లైఫ్ బాగుంటుందని పించేది .కాలేజీ లో మీసం గడ్డం ఇంక బాగా రాలేదే అనుకునే వాణ్ణి .తర్వాత ఇoన్జినీరింగ్ లో అదే ఫీలింగ్స్ ,త్వర గా చదువైపొ ఇ జాబ్ వస్తే పెళ్లి చేసుకొని కాలిమీద కాలు వేసు కొని మన ఇంట్లో టీవీ చూడవచ్చు (అప్పట్లో ఎక్కడెక్కడికో వెళ్లి టీవీ చూడవలసి వచ్చేది ,మెస్ లో ఫ్రెండ్స్ ఇంట్లో ,టీవీ షో రూమ్ లో ).తర్వాత పిల్లలను కనేస్తే వారితో అడుకోవచ్చానో .పేరెంట్స్ కోసమో పిల్లలను కనటం.


తర్వాత పైన చెప్పిన పాట పడు కోవటం .


రోజు గడ్డం గీసుకోలేక మాసిన గడ్డం తో ఆఫీసు కెళ్ళినప్పుడు .....



మనకిష్టం అయిన టీవీ చానల్ చూడాలను కున్నప్పుడు ,గురించి ఎక్కువ చదువు లాక్కుని పోగో ,డిస్నీ చానల్ పెట్టినప్పుడు ..



శ్రీమతి తో గోల్డ్ షాపింగ్ కు కెళ్ళి నప్పుడు ,


పేరెంట్స్ కు శ్రీమతి కి తగాదాలు ఐనప్పుడు ..



నాకంటే ఏ మాత్రం విషయం లేకపోఇన వుయసు ని చూసి ప్రమోషన్ ఇచ్చి నప్పుడు ...



పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు (నైట్ షిఫ్ట్ చేసి వచ్చినతర్వాత) ...



ఎన్నో డబ్బులు పోసి కొన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ పాడాయి పోయినప్పుడు .....


షేర్ మార్కెట్ అధ: పాతాళానికి వెళుతున్నప్పుడు ...


ఇంక ఎన్నో సందర్బాల లో ......................


పైన చెప్పిన పాట గుర్తుకొస్తుంది ...... .ఏ వయసులో ఉన్నప్పడు దాన్ని ఎంజాయ్ చేయాలనీ తెలిసొచ్చింది .ఇప్పుడు పిల్లలతో అంటాను ... ఈ వయసు లోనే ఉండండిరా .బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యం డిరా.


దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని దేనికోసమో పారు గెత్తకుం డా ,దేన్నో సాదించాలని ,ఎవరిమిదో పై చేయి కావాలను కోకుండా మనం సంతోషంగా ఉంటూ పక్కవారిని సంతోష పెట్ట లేకపోఇన కనీసం బాద పెట్ట కుండ ,ఇలా అప్పుడప్పుడు బ్లాగు రాస్తూ ఉంటే బాగుంటుందని అనుకుంటూ ........ముగిస్తున్నాను .





0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్