ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

21, అక్టోబర్ 2008, మంగళవారం

,,,,,,,,,,,,జా .....గిం ........గ్.......


హ్యాపీ డేస్
కాలేజీ డేస్ ఆర్ హ్యాపీ డేస్ . కాలేజీ లో చదివిన వారు అందరూ ఈ విషయాన్ని వప్పు కుంటారు .ఎన్నో మదురమైన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. నెమరు వేసుకొనే సమయం దొరికింది .వినేందుకు మీరందరు (బ్లాగర్స్) ఉన్నారు .సంతోషాన్ని పంచుకుంటే multiply అవుతుంది కదా.
యువకుల్లో ఉడుకు రక్తం అంటారు కదా ...... అది చాలా కరెక్ట్ .ఏ పనైనా చేయాలన్న పట్టుదలతో సాదించే వరకు నిద్రపోరు .కాకపోతే ఆ చేయవలసిన పనిని ఎన్నుకోవటం లో పప్పు లో కాలేస్తుంటారు .ఎక్కడకో వెళ్లి పోతున్నట్లు ఉన్నం ...టాపిక్ డై వర్ట్ అవుతున్నట్లు ఉంది కాదు ... ఓకే ట్రాక్ లోకోద్దాము ...........
సెకన్ద్ ఇయర్ చదివే రోజులు .చదువులో మంచి మార్కులే వచ్చే యి లెండి .టాప్ five లో ఉండేవాడిని .మిగిలిన విషయాల్లో కూడా ముందుండాలి అనే తపన ఉండేది .సో ఫ్రెండ్స్ అంత ఒక రోజు సమావేశమై నిర్ణయాన్ని తీసుకున్నాము . ఉదయాన్నే (నాలుగు న్నరకు ) లేచి కాలేజీ దగ్గరకు జాగింగ్ చేస్తూ వెల్లి ,అక్కడ బాడీ బిల్డింగ్ చెయ్యాలి . wight లిఫ్టింగ్ చేయాలి (డంబెల్ల్స్ మాత్రమే కాదులెండి ) తరవాత బ్యాడ్మింటన్ ఆడాలి .కాలేజీ మా రూమ్ దగ్గర నుంచి ఓ నాలుగు కి .మీ ఉంటుం దను కుంటా . కొన్ని రోజులు అందరం కలిసి వెళ్ళాము .అదే కసి అదే పట్టుదల .. ఒక రోజు రాత్రి లేచాను జాగింగ్ వెళ్ళటానికి తయారయ్యాను .ఫ్రెండ్ ను లేపాను .వాళ్ళు లేవటం లేదు .చవటలు మాట మిద నిలపడరు .నాలుగు రోజులకే వేరి పని ఐపోఇంది అని తిట్టు కుంటూ ఒక్కడినే బయలు దేరాను జాగింగ్ కు . దార్లో కుక్కలు అరుస్తున్నై .అది సహజమే కదా .జగ్గోంగ్ చేస్తూ వెళుతున్నాను .సగం దూరం లో లారీ వెళుతుంది .ఎందుకో అందులోని క్లినరు నావైపు అదోలా చూసారు .గ్రేట్ గా ఫీలుయ్యను .పండు వెన్నెల ఆరపోసి రాత్రి ల అని పించటం లేదు .పౌర్ణమి ముందు రోజనుకుంట. కాలేజీ దగ్గరకు వెళ్ళాను .చాల సేపు exercise లు చేశాను.తెల్ల వార లేదు.ఇంటికి వచ్చేసాను .దార్లో అదే తంతు .కుక్కలు అరవటం ,వింతగా నన్ను చూడటం .......... ఏదో తేడ జరిగి నట్లని పిస్తుంది .అలా బుక్ తీసి చదువుతున్నా అంటే నిద్రలోకి జారుకున్న . లేవరా జాగింగ్ కెల్థము అన్నా మాటలు విని లేచాను .మీరెవరు రాలేదుకదనేను వేల్లోచ్చాను అన్నాను .ఎప్పుడు అన్నారు .పొద్దున్నే అన్నాను .ఇప్పుడు టైం నాలుగున్నర ఐంది.అన్నారు .న వాచ్ చెక్ చేసుకున్న.. కరెక్టే రాత్రి జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకున్న ....................... డాబా మీద పడుకున్నాము .తెల్లారిందని పించి ఫ్రెండ్స్ ని కూడా లేపాను .లేవలేదు .కింద రూమ్ లోకొచ్చి టైం చూసాను .ఒకటిన్నర చూపిస్తుంది .చాల పాత ది అది మా మామయ్య ది .వాచ్ పని చేయటం లేదనుకున్న .రోడ్డు ఎక్కాను .తిరిగి ఇంటికొచ్చి నిద్ర పోయాను .అప్పుడు అర్ధం అయింది.కుక్కలు ఎందుకు అరిసాయో ,లారి క్లినర్ ఎందుకు వింతగాచుసాడో .అర్దరాత్రి ఒకటిన్నరకు రోడ్ మీద జాజింగ్ చేశాను. ఫ్రెండ్స అంత ఒకటే నవ్వులు .ఆ తర్వాత చాల రోజులు నన్ను మోసారను కోండి. ఇప్పటికి ఈ విషయం తలుచు కుంటే బలే నవ్వొస్తుంది .

లేబుళ్లు:

8 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్