ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

23, అక్టోబర్ 2008, గురువారం

ఇంగ్లీష్ స్కిల్స్ ..ఇంప్రూవ్ చేసుకోటం ఎలా ?


ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసు కుం దమని ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం.చాల వరకు రూమ్ మేట్స్ (ప్రక్క రూమ్ కూడా ) కలిసి వెళ్ళే వాళ్ళం .ఎందుకంటే ఎవడైనా సినిమాకు రాకపోతే వాడు బాగుపడి పోడు.చదువుకుని మనకన్నా మార్క్స్ కొట్టేస్తారు కదా !.కావున అందరిని తిసుకేల్లెవాల్లం.అందరిని ఒప్పించి బయటకి వచ్చే సరికి ఎనిమిది ముప్పావు అయ్యేది .జనరల్ గా సెకండ్ షో కే వేల్ల్లె వాళ్ళం.లాస్ట్ సిటీ బస్ ఎక్కేవాళ్ళం(నల్లపాడు నుంచి గుంటూరు సిటీ కి).
బస్ డ్రైవర్ సరిగ్గా తీసుకెళ్ళి పెట్రోల్ బంకు దగ్గర ఆపేవాడు .టైం తొమ్మిది దాటుతుంది .పెట్రోల్ బంకు విజయలక్ష్మి సినిమా హాలు దగ్గర ఉండేది .అక్కడ నుంచి నాజ్ సెంటర్ దగ్గరకు చాల దూరం ఉండేది.సినిమా హాల్స్ అన్ని నాజ్ సెంటర్ దగ్గరలో ఉంటాయి.పెట్రోల్ బంక్ దగ్గర దిగేసి వేరే బస్ పట్టుకునే వాల్లం ,అప్పుడు ఆటో లు అంతగా లేవు .
ఒక సారి gaurisamkar lo english cinema కోసం వెళ్ళాం. సినిమా పేరు గుర్తు లేదు లెండి .అక్కడ బ్లాకులో టికట్స్ అమ్ముతున్నారు .మా దగ్గర అన్ని డబ్బులు లేవు .ఎం చేయాలి? బేరం ఆడటం మొదలెట్టాము .వాడు పైసా కూడా తగ్గించటం లేదు .మా బృందం లో కిషోర్ అనే ఉండేవాడు ,వాడు టికెట్స్ అమ్మే వాడిని బ్రతిమిలడాడు.ప్లీజ్ మా దగ్గర డబ్బులు లేవు తక్కువ కిచ్చేయ్యమని .కాని వాడికి మనసు కరగ లేదు .
పల్లవి లో కూడా ఏదొ ఓ ఇంగ్లీష్ సినిమా ఆడుతున్నట్టు పోస్టరు చూసాం.అక్కడి కి వెళ్ళాం .అక్కడ నేల (least క్లాసు) మాత్రమే దొరికాయి.ఏంటో తెరకు అంత దగ్గర నుంచి ఏమి కనిపించాలా ..ఇంగ్లీష్ ఎలాగూ అర్ధం కాదను కొండి.
ఈ ఇంగ్లీష్ పిచ్చి లోనే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది .నెక్స్ట్ పోస్ట్ లో రాస్తాను

లేబుళ్లు:

1 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్