ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

28, అక్టోబర్ 2008, మంగళవారం

ఖయామత్ సే ఖయామత్ తక్ .............


ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా కు ముగింపు.
ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి .ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే ఎక్షామ్ ముందు మూడు రోజులు సెలవలు వచ్చా యి .సినిమాకు వెళదామని ప్లాన్ చేసాము .చదవి చదివి బుర్ర వేడి ఎక్కింది .కాస్త రిఫ్రెష్ అవుదాంఅని అనుకున్నాము.కానీ అందరూ రావటం లేదు .నేను ,రమేష్ ఇద్దరం బయలు దేరాము .సెకండ్ షో కు కాదు matni కి .ఏ సినిమాకు వెళ్ళాలి అని ముందు ఎప్పుడు అనుకోము .
బస్ లో నుంచి బయటకు చూస్తున్నాము .విజయ లక్ష్మి సినిమా హాలు దగ్గర qayamath se qayamat tak పోస్టరు కనిపించింది .అక్కడ బస్ దిగి టికెట్స్ కొని లోపలికి వెళ్ళాము .సినిమా మొదలయ్యాక అర్దమైంది అది హింది సినిమా అని.హింది సినిమాల గురించి అంత గా తెలియదు .అమీర్ ఖాన్ ఎవరో మాకు తెలియదు .అప్పట్లో అదొక సూపర్ హిట్ సినిమా అని తర్వాత తెలిసింది .మాకు మాత్రం సినిమా అసలు నచ్చలేదు . అర్థము కాలేదు .
ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా పోస్టర్ లో సినిమా పేరు ఇంగ్లీష్ లో ఉండటం వల్ల మేము దొరకి పోయాము.ప్రాక్టికల్ జోక్ కదా? నా లైఫ్ లో దారుణం గా బుక్ ఐన సంఘటన ఇది .

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్