అరుంధతి సినిమా నిజంగా అంత బాగుందా ?
అరుంధతి సినిమా నిజంగా అంత బాగుందా ?
అందరూ మంచి రివ్యు లు రాస్తున్నారు .సినిమాలో గ్రాఫిక్స్ తప్ప నాకేమి నచ్చలేదు .దేముడు ఉన్నాడు అని నమ్ముతాముకాబట్టి దయ్యం ఉందని నమ్మాలట.పకీరు బాబా లకు మంచి గిరాకి పెరుగుతుంది . కొంత మంది అమాయకుల చేతులు ,కాళ్ళు ,నాలుక తీసేస్తారు .అఘోరాలు అన్న అనుమానంతో .
పిల్లల మనసులో ప్రేతాత్మలు, దయ్యాల గురించి బాగా నాటుకు పోతుంది .నిజంగా కోడి గ్రేట్ .దెయ్యాలు ,క్షుద్ర శక్తులు లేవని చెప్పే సైన్స్ &టెక్నాలజీ ని ఉపయోగించు కొని అఘోరాలు ఉంట యని నిరూపించాడు.
సాదారణంగా సినిమాకు వినోదం కోసమ్ వెళతాము.వినోదము అంటే బయపడటం కుడా అని నాకు తెలియదు .
డబ్బులిచ్చి నవ్వటానికి సినిమాకు వెళతాము ,హీరోయిసంకోసం వెళతాము ఎందుకంటే మనం చేయలేని రొమాన్స్ ,యుద్దాలు చూసి మనం చేసినట్లు వుహించుకుంటాం. ఏడుపు సినిమాలు కూడా చూస్తాము ,బయట ఏడవలేక సినిమాలో బాగా ఏడ్చి వస్తాము .ఇది కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు .
కాని డబ్బులిచ్చి బయపడటానికి మనం తయారైపోయాం .ఇంతకు ముందు చాలా తక్కువమంది ఇలాంటి వారు వుండేవారు .
అఘోరాల గురించి చాల బాగా ప్రాజెక్ట్ చేసాడు కాని ,దేవత (జేజమ్మ) శక్తీ గురించి అసలు చెప్పనే లేదు .ఈ సినిమా వల్ల ఏమైనా సమాజానికీ ఉపయోగాముందా? కీడు తప్ప ...
లేబుళ్లు: సినిమా
8 కామెంట్‌లు:
ఇవాళే ఈ సినిమా చూసాను.
తల తిరిగిపోయింది.
విషాదం ఏమిటంటే ధియేటర్ నిండా స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి పుస్తకాల బ్యాగులతో సహా వచ్చిన టీనేజ్ పిల్లలే కనిపించారు. ఇంట్రవెల్ లో చాల మంది విద్యార్ధులు తమ బాక్సులు తెరిచి టిఫిన్లు తినడం కనిపించింది.
మనల్ని వెయ్యేళ్ళ వెనక్కి తీసుకెళ్ళే ఈ చెత్త కోసం అంతమంది తమ చదువులను పక్కన పెట్టి మరీ రావడం బాధగా అనిపించింది.
ప్రజల మనసులను కలుషితం చేసే, సమాజం లో మూఢ నమ్మకాలను, భయాలను పెంపొందించే ఇట్లాంటి సినిమాలను ప్రభుత్వం అడ్డుకోకపోవడం పోవడం ఘోరం.
ఇక ఈ దేశాన్ని దయ్యాలే కాపాడాలి.
Uyyaala ద్వారా, 29 జనవరి, 2009 4:13 PMకి వద్ద
మంచి ప్రశ్నలు. అయితే, ఇది కేవలం ఒక ఫాంటసీ చిత్రం మాత్రమే. సినిమాల రాకకు ముందు నుండీ మన సమాజంలో మూఢ నమ్మకాలున్నాయి. చెప్పాలంటే, సినిమాలొచ్చాకనే అవి తగ్గాయి (అంటే, సినిమాల వల్ల తగ్గాయని నా ఉద్దేశం కాదు; గత వందేళ్లలో తగ్గాయని మాత్రమే నా ఉద్దేశం). కాబట్టి, అరుంధతి చూసి క్షుద్ర శక్తుల మీద నమ్మకాలు పెంచుకునేవాళ్లు ఉండకపోవచ్చు.
మీకు 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నచ్చిందా? దాని మీద కూడా ఇటువంటి విమర్శలే చెయ్యగలరా? చెయ్యలేనప్పుడు అరుంధతి మీద కూడా చెయ్యకూడదు.ఇక, 'అరుంధతి నాకు నచ్చలేదూ అంటారా, అది మీ ఇష్టం. ఒక సినిమా అందరికీ నచ్చాలనేమీ లేదు కదా.
Anil Dasari ద్వారా, 29 జనవరి, 2009 9:17 PMకి వద్ద
అమ్మో దెయ్యలా సినిమా చూడడానికేకాదు అసలు ఆ పేరు వినడానికే భయం నాకు .. కాబట్టీ అరుందతి సినిమా చూసే చాన్సే లేదు నేను :)
నేస్తం ద్వారా, 30 జనవరి, 2009 5:40 AMకి వద్ద
అబ్రకదబ్ర గారు,
లార్ద్ ఆఫ్ థ రింగ్స్ cinima నాకు నచ్చ్చలేదు .ఆస్కర్ అవర్డ్ వచ్చినంత మాత్రాన చినిమా బగుండాలని లేదు.
ఆస్కర్award కొసం మనం అర్రులు చాస్తున్నాము. స్లం డాగ్ గురించి గొల్లపూడి గారి సందే సండేసం
Koumudi.net లొ వినండి వినండి
ప్రభకర్ గారు,
నా పరిస్తితి అదే .అందరూ స్తుడెంట్స్ వచ్చారు.
నేస్తం ,
చూదకపొటం Better.
అరుణాంక్ ద్వారా, 30 జనవరి, 2009 2:12 PMకి వద్ద
ఒక సినిమా వ్యక్తిగతంగా నచ్చక పోవటం వేరు.
అది సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళే భావజాలాన్ని ప్రబోధిస్తోంది అన్న ఆరోపణ వేరు.
ఫేంటసీ కథలూ, హారర్ కథలూ ఒక రకమైన ఉద్రేకం (థ్రిల్)ని కలిగిస్తాయి. కొంతమందికి ఆ థ్రిల్ బాగుంటుంది. అంతమాత్రాన అది సమాజాన్ని వెనక్కి తోసేసినట్టు ఎలాగవుతుందో నాకు అర్ధం కాదు. సరే, స్కూలు, కాలేజి పిల్లలు బడీ ఎగ్గొట్టి సినిమాకి పోవటం అన్నది సినిమాలు మొదలైన దగ్గర్నించి జరుగుతూనే ఉంది. బడెగ్గొట్టి ఠాగూరు సినిమాకెళ్తే మంచీ, అరుంధతి సినిమాకెళ్తే చెడూ జరుగుతాయా?
ఆస్కార్లు గొప్ప సినిమాలకి ప్రాతినిధ్యం వహించడం మానేసి చాలా కాలమైంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఆస్కార్లు రావడం వల్ల గొప్ప సినిమా కాలేదు. ఆ సినిమా నిర్మాణంలో పని చేసిన వారందరూ ఎంతో నిబద్ధతతో ఎంతో కష్టపడి కళాత్మకంగా ఆ సినిమాని మలచడం వల్ల అది గొప్ప సినిమా అయింది.
కొత్త పాళీ ద్వారా, 30 జనవరి, 2009 8:52 PMకి వద్ద
'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఆస్కార్ రాబట్టి అందరికీ నచ్చలేదు. ఆ మూడు సినిమాలూ ఆస్కార్ నామినేషన్లకన్నా నెలల ముందే బాక్సాఫీసు దుమ్ము దులిపేశాయి (అవి విడుదలయింది - వరుసగా - 2001, 2002, 2003 నవంబర్ మాసాంతంలో. అకాడెమీ అవార్డుల నామినేషన్లు ప్రకటించేది మరుసటేడాది జనవరి మధ్యలో. అవార్డులు ప్రకటించేది మార్చిలో)
సరే, ఆ సినిమా మీకు నచ్చకపోవటమనేది వేరే విషయం. నేను పైనే చెప్పినట్లు, ఒక సినిమా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నచ్చిన నాకు హ్యారీ పాటర్ పరంపర అంతగా నచ్చలేదు. రెండూ ఫ్యాంటసీ కధలే మరి.
ఇక, స్లమ్‌డాగ్ గురించి గొల్లపూడి ఏమన్నారో తర్వాత వింటాను. నాకైతే ఆ సినిమా నచ్చింది. సాధారణంగా సినిమా చివర్లో end credits వచ్చేటప్పుడు లేచి వెళ్లిపోయే అమెరికన్ జనాలు ఈ సినిమా end credits లో వచ్చే 'జయ్ హో' పాటని ఆసక్తిగా కూర్చుని చూశారంటే వాళ్లకదెంతగా నచ్చిందో ఊహించుకోండి.
దాన్ని మనదేశంలోని మురికిని హైలైట్ చేస్తూ తీశారు కాబట్టే విదేశీయులకి తెగ నచ్చేసిందని వాదించే వాళ్లు కొద్ది బుద్ధులతో ఆలోచిస్తున్నారని నేనంటాను. 'గాంధీ' కూడా విదేశీయులకి బ్రహ్మాండంగా నచ్చింది మరి. సత్యజిత్ రే మీద కూడా ఇలాంటివే ఆరోపణలున్నాయి - మన దేశంలో పేదరికాన్ని బయటివాళ్లకి చూపించి సొమ్ము చేసుకుంటాడని. నిజానికి, ఆయన గురించి బయట సాధారణ ప్రేక్షకుల్లో తెలిసిన వాళ్లని వేళ్లపై లెక్క పెట్టొచ్చు. ఆయన సినిమాలూ బయట ఎవరికీ తెలియదు. ఇక రే వాటి మీద సొమ్ము చేసుకున్నదెక్కడ?
ఆస్కార్లనేవి హాలీవుడ్ సినిమాలకి ఉద్దేశించిన బహుమతులే. వాటికోసం అర్రులు చాచనవసరం లేదు. అయితే, ఓ మంచి సినిమాకి అంతర్జాతీయంగా ఓ ప్రముఖ అవార్డు వచ్చినప్పుడు - మనకది నచ్చలేదని - దాన్ని తీసిపారేయనవసరమూ లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లది 'అందని ద్రాక్ష పుల్లన' తరహా.
Anil Dasari ద్వారా, 31 జనవరి, 2009 12:07 AMకి వద్ద
సినిమా చాలా బాగుంది. చక్కగా తీసాడు కోడి రామకృష్ణ. కామెడి అదిరింది.
krishna rao jallipalli ద్వారా, 3 ఫిబ్రవరి, 2009 8:16 PMకి వద్ద
worst movie
Unknown ద్వారా, 12 ఫిబ్రవరి, 2009 8:20 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్