ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

9, జూన్ 2009, మంగళవారం

మున్నార్ హిల్ స్టేషన్ .



మా ట్రైన్ ఎర్నాకులం చేరవలసిన సమయం ౦౩:30 . ౩ గంటలకే చేరాం .టైం టేబుల్ మారిందేమోనని కంగారుగా దిగేసాం .అర గంట సేపు అక్కడే ఆగింది అనుకోండి .జోరున వర్షం కురుస్తుంది .బుక్ చేసిన కార్ ౦౩;40 కి వచ్చింది .మున్నార్ కు బయలు దేరాం .ఒక వారం ముందే వర్షాలు కేరళ ను తాకాయి .మేమే కారణం అనుకుంటా .లోగడ ఒక సారి పాపి కొండలుటూర్ ప్లాన్ చేసి రాజమండ్రి వెళ్ళేసరికి సైక్లోనే వచ్చింది .ఒక రోజు GVK పవర్ లో ఫ్రెండ్ దగ్గర ఉండివచ్చేసాము .ఎక్కడయినా వర్షాలు కావాలంటే మామ్మల్ని పిలవండి సరిపోతుంది .
అనవసరం గా సీసన్ చివ లో బయలు దేరం అని అనుకున్నాం.ఇండిగో కార్ comfortble గా ఉంది .ఎర్నాకులం నుంచి మున్నార్ 120 km ఉంటుంది .గాట్ రోడ్ ఒక 6౦ KM ఉమ్ద్టుంది .మద్యలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది .అప్పుడే తెల వారుతుంది .సరిగ్గా వెలుతురు లేని కారణం గా మరియు వాన వలన బాగా చూడలేక పోయాం.
మున్నార్ 8 గంటలకు చేరాం. మున్నార్ ఎంటర్ అయిన దెగ్గర నుంచి డ్రైవర్ టి తాగుతారా ,టిఫీను చేస్తారా అని ఒకటే అడిగాడు .ఎందుకబ్బా ఇంత ఇన్టెరెస్ట్ చూపిస్తున్నాడు అనుకున్నాం .తర్వాత అర్ధం అయ్యింది .మున్నార్ లో హోటల్ చెక్ అవుట్ టైం 12 గంటలు .అప్పటి వరకు టైం పాస్ చేయటం కోసం అనమాట.genaral గా visitors ఉదయం ఫ్రెష్ అయ్యి 9 గంటలకు వెకేట్ .9 గంటలకు రూం ఇచ్చారు మాకు .ముందు ఫ్రెష్ అవటానికి ఇచ్చి తర్వాత సూట్ ఇచ్చారు (2000 రుపీస్)బాగానే ఉంది .దగ్గరలోనే మార్వాడి హోటల్ లో టిఫిన్ చేసి 11 గంటలకు సైట్ సీఇంగ్ కు బయలు దేరాం.మున్నార్ సిటీ చిన్నది .చాలా వరకు టీ గార్డెన్స్ టాటా కంపెనీ వారియే .టీ ప్లాంట్స్ అన్నిపరిచిన ఆకు పచ్చ కార్పెట్ లా ఉంటుంది .౩౩ kM దూరం లో ఉన్న టాప్ హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ ఇస్ ది ఎండ్ పాయింట్ of సైట్ సీఇంగ్ . ఎక్కడకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళు గుంపులు గుంపులు గా తగులుతున్నారు .madupetti dam మరియు kodali డామ్ స్పాట్స్ బాగున్నాయి.ఎటు చూసినా గ్రీన్ ,గ్రీన్ .చల్లని గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంది .wild elephants ను చూసాము దూరం నుంచి .చీకటి పడ్డ తర్వాత రోడ్ల మధ్యకు వచ్చి అటాక్ చేస్తాయట.


కేరళ అంటే coconuts కి ఫేమస్ అనుకుంటాము కానీ అక్కడ చాల అరుదుగా కనిపించాయి.చాలా కాస్ట్ లి (20 రూపాయలు ఒకటి ).లంచ్ గా ఫ్రెష్ దానిమ్మ కాయలు ,అల్బకర ,బనానా ,మాంగోస్ ,కారేట లు లాగించాము .సాయంత్రం 5.౩౦ కి హోటల్ చేరాము .వర్షం మొదలయింది .బడలిక తో రెండు గంటలు రెస్ట్ తీసుకోని తర్వాత dinnner కు వెళ్ళాం(ముందు రోజు కుడా రాత్రి ప్రయాణం కదా) .రెండు రోజులు అక్కడ ఉండే విదంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది . నాకు ఊటీ ,కోడై కెనాల్ కంటే మున్నార్ .


కేరళ లో christians శాతం ఎక్కువ .నా టూర్ vehicle కోసం deal చేసింది డాల్టన్ తో ,కార్ డ్రైవర్ న్యూటన్ ,హౌస్ బోటు వోనర్ Jeorge ,మార్గ మద్యం లో ఒక విశిష్ట మయిన వ్యక్తిని కలిసాము ,ఇతని గురించి తర్వాత రాస్తాను .అతని పేరు విన్సెంట్ .నెక్స్ట్ ప్లేస్ goes టుముస్లిమ్స్ .


మరికొన్ని విషయాలు తదుపరి పోస్ట్ లో

1 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్