ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

27, ఆగస్టు 2008, బుధవారం

ప్రజా రాజ్యం

చిరంజీవి గారు ఎట్టకేలకు తన పార్టి పేరును పతకాన్ని పాలసీని నిన్న తన అభిమానుల మరియు సన్నిహితుల సమక్షం లో ఆవిష్కరించారు .గత ఎనిమిది ,తొమ్మిది నెలలుగా ఎంతో శ్రమించారు. చాల బాగ్రౌండ్ వర్క్ చేసారు.దాని పలితమే ఈ మెగా సభ విజయవంతం.పది లక్షలు పైగా జనం వచ్చారని అంచనా ... టీవీ లో ఇంక ఎంతోమంది ప్రోగ్రాం చూసారు .అందులో నేనొకడిని.
చిరంజీవి గారి లో సి న్సియ రి టి కనిపిస్తుంది .కానీ తను అనుకున్నది సాదించాలి అంటే ఇంక చాలా శ్రమించాలి .చాలామంది కష్టాలు పడే పైకి వస్తారు కానీ ..తర్వాత మూలాల్ని మర్చి పోతారు .చిరంజీవి గారు తను పడ్డ కష్టాల్ని నెమరువేసుకున్నారు.
అవినీతి మనకు చాలా పెద్ద అవరోధం గా మారిం ది. దాన్ని అదిగ మించ గలిగితే మనకు ప్రపంచంలో ఎదురు ఉండదు.కష్టపడకుండాడబ్బులు రా వలనుకోవడం మరియు తక్కువ శ్రమకే ఎక్కువ పలితం కావాలనుకోవటం వల్ల అవినీతి పుడుతుంది .మోరల్ వలుఎస్ గురించి మనలో ఎంతమంది మన పిల్లలకు చెప్తున్నాం ?
ఒక సెలబ్రిటీ చెపితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది.చిరంజీవి గారుఅవినీతి అంతానికి కృషి చేస్తారని ఆశిస్తాను.
చిరంజీవి గారికి నా సలహా
వీ లైనంత ఎక్కువ మంది తో ఇంటరాక్ట్ అవ్వండి .వాస్తవికతను గ్రహించండి ,నిర్న యా ల ను తీసుకోండి .

17, ఆగస్టు 2008, ఆదివారం

ఒలంపిక్స్ - ఫొటోలు














ఒలంపిక్స్ - ఫొటోలు

ఇలాంటి డాన్స్ మనము గమ్యం సినిమాలో చూసాము .చాలాబాగుంది కదూ ...






అరుణాంక్







15, ఆగస్టు 2008, శుక్రవారం

తవిక



పసిగుడ్డు బ్లాగ్ ప్రేరణ

వలపు కుంచ పట్టి
ప్రేమామృతం తో
మనసు లోతుల్లో
నాచెలి బొమ్మ గీసా
నీకే ఆంకితం ఇచ్చేసా !


అరుణాంక్

లేబుళ్లు:

9, ఆగస్టు 2008, శనివారం

మొదటి రోజు స్కూల్ లో

నా మొదటి రోజు స్కూల్ గురించి ఇప్పటికి మా ఇంట్లో చెప్తుంటాను .నేను ఎంత ఉత్సాహంగా చేప్తనో అంతే ఉత్సాహంతో నా బార్య మరియు మా పిల్లలు అంతే ఉత్సాహంగా వింటారు.ఆరోజు నేను ఒక పలక తీసుకోని నాన్న గారి వెంట సంతోషం గానే వెళ్ళాను . మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం కాదు, ఈ- స్కూల్ కానే కాదు ,టెక్నో స్కూల్ అసలే లే దూ . అసలు స్కూల్ బిల్డింగే లేదు.అది ఒక టెంపుల్ .స్కూల్ వరకు బాగానే వెళ్ళాను కానీ ...... అ తర్వతః నాన్న చే ఇ పట్టుకొని ఏడుపు లంకించు కున్నాను . నాన్న నువ్వు కూర్చోమని . మా పంతులు గారి పేరు వెంకయ్య గారు . నన్ను పట్టుకొని మా నాన్నని వెళ్ళమని చెప్పాడు.మొదటి రోజు ఓనమాలు దిద్దాను .ఇంక ఎప్పుడూ ఏడవ లేదులే. మా పిల్లలు ఎందుకు ఎడ్చావు డాడీ అని ఆట పట్టి స్తుంటారు .
మా ఊరి పేరు చెప్పనే లేదు క దూ ? అది గుంటూరు జిల్లా ,గురజాల తాలూకా లో చర్లగుడిపాడు గ్రామము .

తదుపరి పోస్ట్ లో కొనసాగిస్తా .తెలుగులో టైపు చేయటం కో౦చం కష్టంగానే ఉంది .

లేబుళ్లు: