ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

25, జులై 2009, శనివారం

వెంగమాంబ సినిమా ఎలా ఉందంటే..?

చాల రోజుల తర్వాత బ్లాగ్ రాయటం కుదిరింది. వెంగమాంబ సినిమా చూసి వచ్చాము . అందరికి చూడమని సలహా ఇస్తున్నాను .సినిమా చాలా బాగుంది..ఫ్యామిలి అంతా కలిసి నిర్భయంగా చూడవచ్చు .దురదృష్ట వశాత్తు ఇలాంటి సినిమాలకు మిడియా హెల్ప్ చేయదు .
మీనా వెంగమాంబ రోల్ కు perfect గా సూట్ అయింది. రాఘ వేమ్ద్రుడి చేయి పడలేదు కాబట్టి అశ్లీల దృశ్యాలు లేవు .పిల్లలను తీసుకుని వెళ్ళండి .మంచి సినిమాలను ప్రోత్సాహించవలసిన బాద్యత మనందరి మీద ఉంది. otherwise మంచి సినిమాలు ఇక రావు.

లేబుళ్లు:

5, జులై 2009, ఆదివారం

కంది పప్పు కిలో ఎనభై రూపాయలట

కంది పప్పు కిలో ఎనభై రూపాయలట
వచ్చే నెలలో రైస్ కిలో ఏబయి రూపాయలవుటుదట
మేము ఆఫీసు కు వచ్చే టప్పుడు vehicleలో అంటున్నారు సహుద్యోగులు . రైస్ వంద kg లు ఇప్పుడే కోనేద్దమా ? అంటారు ఒకరు .అందరు ఇలా నే కొనేస్తారు ,వచ్చే వారం లో నే 50 రూపాయలవుతుందని అన్నాను నేను .
inflation (ద్రవ్యోల్పణం ) చుస్తే negative చూపిస్తున్నారు.అసలు Inflation ఎలా లేక్కిస్తారో?
ఇలా ధరలు పెరుగుతుంటే గవర్నమేంట్ అదుపు చేయదా? అని ఇ౦కొకతను అంటాడు.
మీకేమైనా తెలుసా?