కేరళ ట్రిప్
ఎవరైన వెళ్లి ఉంటే దయ చేసి నాకు సలహాలు ఇవ్వగలరు .
లేబుళ్లు: tax
శనివారం సాయంత్రం ఆకాశమంత సినిమాకువెళ్దామని బయలుదేరాము .శనివారం సాయంత్రం టికెట్స్ దొరకవని అనిపించింది కాని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు కదా దొరుకుతవిలే అనుకున్నా .. నా అనుమానమే గెలిచింది .Inox లో కూడా దొరక లేదు . ఇక చూడ దగ్గ వి కూడా ఏమీలేవు .అలా ప్రశాతంగా నడుచు కుంటూ బాబాయి హోటల్ కు వెళ్లి టిఫిన్ చేసాము .బాబాయి హోటల్ విజయవాడ లో చాలా పాపులర్ .బ్రహ్మానందం హీరో గా ఒక సినిమా కూడా వచ్చింది .వెన్న నెయ్యి ఎక్కువగా వాడుతున్నారు .కొలెస్ట్రాల్ గురించి ఎక్కువగా కేర్ తీసుకునేవాళ్ళు వద్దని చెపితే బెటర్ .
అలంకార్ బేకరి కెళ్ళి బ్రెడ్ తీసుకుని బీసంట్ రోడ్ కు దారిలో షాపింగ్ చేసుకుంటూ నడుచు కుంటూ వెళ్ళాము .శ్రీరామ నవమి కదా బీసంట్ రోడ్ లో గుడి దగ్గర పూజ లు జరుగుతున్నాయి .ఇసుక వేస్తె రాలనంత జనం .విరజాజులు కొందామని వెళ్లి మల్లెల తోతిరిగివచ్చింది శ్రీమతి మూర 25 రుపాయలట .
modern సూపర్ మార్కెట్ దగ్గర అదేపరిస్తితి .కాలు పెట్టేందుకు కూడా జాగా లేదు .అక్కడ బాదం పాలు తాగి లోపల షాపింగ్ చేసి మన్హర్ రెడిమేడ్స్ కు వెళ్ళాము .అక్కడ నుంచి లాస్ట్ కస్టమర్ గా బయటకు వచ్చాము .
సినిమా చుడకపోయినా శ్రీమతి చాలా హ్యాపీ ఇద్దరం కలసి ఇంత సేపు ప్రశాతంగా విజయవాడ వీదుల్లో తిరుగుతూ షాపింగ్ చేయటం మొదటి సారి. .
"ఆకాశమ౦త" కోసం వెళ్లి బజారంతా చుట్టి వచ్చాము .